కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బందోబస్తు ఏర్పాటులను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు ఈనెల 6న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బందోబస్తు ఏర్పాటులను శుక్రవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తుపై ఆయన నాయకులతో చర్చించారు. సభా వేదిక, పార్కింగ్, విఐపి ల బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.