ఉరవకొండ: చికెన్, మటన్ మార్కెట్‌లపై తూనికలు కొలతల శాఖ అధికారుల ఆకస్మిక దాడులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో చికెన్, మటన్ మార్కెట్‌లపై తూనికలు కొలతల శాఖ అధికారుల ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొందరు వ్యాపారుల తూకాల్లో భారీ తేడాలు గుర్తించి, కిలోకు 100 నుంచి 200 గ్రాముల వరకు తక్కువగా ఇస్తున్నట్లు బయటపడింది. నిషేధిత తక్కెడలను స్వాధీనం చేసుకుని, వ్యాపారులపై చర్యలు చేపట్టడం జరిగిందని సర్కిల్ అధికారి శంకర్ పేర్కొన్నారు.