ఉరవకొండ: బెలుగుప్ప మండల డిప్యూటీ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన హనుమంతు రెడ్డి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల డిప్యూటీ ఎంపీడీవో గా హనుమంత్ రెడ్డి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పదోన్నతి పై బెలుగుప్ప డిప్యూటీ ఎంపీడీవో గా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బెలుగుప్ప ఎంపీడీవో లక్ష్మీనారాయణ వద్ద రిపోర్టు చేసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ ఎంపీడీవో మండల ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.