కనిగిరి: చిన్న గొల్లపల్లిలో ఈనెల 29 నుండి మే 4వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు: ఈవో నరసింహా బాబు
హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 29 నుండి మే 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహ బాబు తెలిపారు. ఉత్సవాలకు హాజరుకావాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డిని సోమవారం నరసింహ బాబు కలిసి ఆహ్వానించారు. అనంతరం హనుమంతుని పాడు ఎస్సై రాజ్ కుమార్ ను కలిసి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. భక్తులు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసి, స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు