ఉరవకొండ: వజ్రకరూరులో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్
స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగళవారం వజ్రకరూరు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాలలో మరియు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాల గురించి తెలియజేస్తూ,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, కొంతమంది విద్యార్థులను పాఠశాలలకు జాయిన్ చేసుకున్నారు,ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ ఫార్మర్ సర్పంచ్ మోనాలిసా,ప్రాథమిక పాఠశాల చైర్మన్ శాంతప్ప, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.