కనిగిరి: పట్టణంలోని శ్రీ వాసవి మాత విగ్రహ పునః ప్రతిష్ట లో భాగంగా వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు
కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహ పున :ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆవాహిత హోమం, శ్రీ సూక్త హోమం, దీక్ష హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు ఆలయానికి తరలివచ్చి హోమ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈనెల 12వ తేదీన అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని, భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ దేవకి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు తెలిపారు.