కనిగిరి: పేదలకు మూడు పూటలా అన్న క్యాంటీన్లతో ఆహారం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: కాయ కష్టం చేసుకునే పేదలకు మూడు పూటల ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఎర్రగొండపాలెం లో బుధవారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఏపీ లో పేదలు, కూలీలు ఎక్కువ అని వారికి మూడు పూటలా అన్న క్యాంటీన్లతో సీఎం చంద్రబాబు ఆహారం అందిస్తున్నారని, మండల కేంద్రాలలో కూడా ఈ పథకం త్వరలో విస్తరిస్తుందన్నారు