కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో జరిగే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో జరిగే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ద్విచక్ర వాహనాలకు ఒక ప్రాంతంలో కార్లకు, మరొక ప్రాంతంలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. ఈ ఫెస్టివల్కు వచ్చేవారు బాధ్య తాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. మెరైన్ పోలీసులతో కలిపి తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్వేక్షిస్తుంటామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఉన్నారు.