ఉరవకొండ: ఆర్.కొట్టాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం. -రూ. 15 లక్షల పైగా ఆస్తి నష్టం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఆర్.కొట్టాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెను అగ్ని ప్రమాదంలో మంటలు చెలరేగి రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారం, రూ.50 వేల నగదు, ఓ బైక్ పూర్తిగా కాలిపోయాయి. అలాగే 10 మేకలు, 30 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.15 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఓబులేసు, ఆనంద్ లు వాపోయారు. *మీ సాక్షి టీవీ లో...*