సంతనూతలపాడు: విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య
చీమకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించి, విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య ఆదివారం క్విజ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా విజేతలుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .... విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా , వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలన్నారు. విద్యార్థులకు నిర్వహించే ఇటువంటి పోటీలు వారిలోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికితిస్తాయని కమిషనర్ తెలిపారు