కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు, జరిమానాలు విధింపు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాహనదారులకు పోలీసు అధికారులు జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే జరిగే అనార్థాలను వివరించి చెప్పారు. అలానే ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొని ప్రయాణించే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీసులు వాహరదారులకు సూచిస్తున్నారు.