రాప్తాడు: నసనకోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులతో కలిసి పూజలు నిర్వహించిన MLA పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ 2026 సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గురుకుల పాఠశాల అడ్మిషన్ ఫారాలను అందించడం జరిగిందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.