కనిగిరి: పట్టణంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్ అవగాహన
కనిగిరి పట్టణంలోని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై కనిగిరి ఆర్డీవో తోట అజయ్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా బిఎల్ఓ లను నియమించడం జరిగిందన్నారు. ఇళ్ల వద్దకు వచ్చే బిఎల్వోల చేత ఓటర్లు తమ ఓటుకు సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించిన ఓటు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.