ఉరవకొండ: గ్రామంలో బెల్ట్ షాపులు తొలగించాలని పోలీసులకు పిర్యాదు చేసిన శ్రీరంగాపురం గ్రామస్తులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామపంచాయతీలో మద్యం అమ్మకాలు చేస్తున్న బెల్టు షాపులను తొలగించాలని గ్రామస్తులు మహిళలు కలసి సోమవారం సాయంత్రం బెలుగుప్ప స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ బెల్ట్ షాపులను నిర్వహించడం మూలంగా తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసుల ఎదుట వాపోయారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించడం మూలంగా మద్యం తాగడానికి కూలీ పోయిన డబ్బు అంత కుటుంబాల్లోని మగవారు ఖర్చు చేస్తున్నారని కావున బెల్ట్ షాపులను తొలగించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.