రాప్తాడు: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు రాప్తాడు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన టిడిపి నేతలు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో గురువారం 6 గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అమరావతి రాజధానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా రాప్తాడు నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామీణలో టిడిపి నేతలు బైక్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పరిటాల సునీత హైదరాబాదులో క్యాండిల్ లో వెలిగించి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన అమరావతి మార్చడానికి వీల్లేదని అందుకు చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు.