సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారికి వైభవంగా శ్రీ చక్ర అర్చన
చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారికి శ్రీ చక్ర అర్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి పట్టణంలోని భక్తులు ఆలయానికి తరలి వచ్చి పేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ చక్ర అర్చన కార్యక్రమంలో సామూహికంగా పాల్గొని అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అనంతరం పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు అమ్మవారి, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.