కనిగిరి: హనుమంతునిపాడులో ఈనెల 10న శుక్రవారం కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం
హనుమంతునిపాడులో ఈనెల 10వ తేదీన శుక్రవారం పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసుకుని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందజేయాలని ఆమె తెలిపారు. కనిగిరి నియోజకవర్గం లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు.