సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఆక్రమణలతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, పట్టించుకోని అధికారులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లోని లైబ్రరీ సెంటర్ నందు రహదారిపై ఆక్రమణలు తొలగించాలని ప్రజలు డిమాండ్ చస్తున్నారు. రహదారిపైకి దుకాణాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. రహదారిపై ఆక్రమణల మూలంగా వాహనాలు ఎక్కడికక్కడ అని నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అధికారుల స్పందించి, రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించి, వాహనదారులకు, స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.