కనిగిరి: పెదచెర్లోపల్లి మండలం పెద ఇర్లపాడు లో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న
9 మంది అరెస్ట్
పెదచెర్లోపల్లి: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి తొమ్మిది మందిని అరెస్టు చేసిన సంఘటన పెదచెర్లోపల్లి మండలం పెద ఇర్లపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద ఇర్లపాడు గ్రామ శివారులలోని పొలాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.5630 లు నగదును స్వాధీనం చేసుకున్నారు.