ఉరవకొండ: గంగవరంలోని చౌక ధాన్యపు దుకాణాలను తనిఖీ చేసిన మండల తహసీల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామంలో ఉన్న 25,26 నెంబర్లు కలిగిన చౌక ధాన్యపు దుకాణాలను మంగళవారం గ్రామ రెవిన్యూ అధికారి రాజశేఖర్ తో కలిసి మండల తహసిల్దార్ అనిల్ కుమార్ తనిఖీ చేశారు. ఆయా చౌక ధాన్యపు దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మిగులు సరుకులను పరిశీలించారు. వినియోగదారులకు ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు అందించిన సరుకులన్నింటిని సక్రమంగా పంపిణీ చేయాలని తూకాలలో ఎలాంటి మోసాలకు పాల్పడరాదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పతే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ హెచ్చరించారు.