ఉరవకొండ: విద్యుత్ సరఫరా లైన్ ల కింద చెలరేగిన మంటలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెళుగుప్ప తండా సమీపంలో విద్యుత్ సరఫరా లైన్ల క్రింద కొందరు ఆకతాయిలు శనివారం సాయంత్రం మంటలను వేశారు. మంటలు ఈదురు గాలులకు విస్తరించి సమీపంలో ఉన్న వ్యవసాయ తోటల కంచెలకు వ్యాపించాయి. సమీపంలోని రైతులు, విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి మంటలు విస్తరించకుండా అదుపు చేశారు. మంటల సమీపంలో గడ్డివాములు పంట నూర్పిడి కల్లాలు ఉన్నట్టు అయితే పెను ప్రమాదం సంభవించేదని రైతులు వాపోయారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ఆకతాయిలపై పోలీసులు చర్యలు చేపట్టాలని రైతులు పేర్కొంటున్నారు.