సంతనూతలపాడు: మాచవరంలో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బీసీ కాలనీని ఆయన సందర్శించారు. బీసీ కాలనీలో మంచినీటి డీప్ బోర్లకు సంబంధించిన మోటర్లు చెడిపోయాయని, దీంతో పది రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన ఆయన వెంటనే మోటర్లకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా చేయాలని, చెడిపోయిన బోర్లకు కూడా మరమ్మతులు చేపట్టి నేటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.