కనిగిరి: పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ ఉత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవ ఉత్సవాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చి, స్వామివారి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.