సంతనూతలపాడు: చీమకుర్తి మండలం చండ్రపాడులో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
చెముకుర్తి మండలం లోని చంద్రపాడు లో శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామంలో తాగునీటి సరఫరాను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, అదనంగా మరో వాటర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించాలని గ్రామ ప్రజలు కలెక్టర్ రాజాబాబును కోరారు. స్పందించిన కలెక్టర్ గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించేందుకు ప్రతిపాదనలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు.