కనిగిరి: ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛపదం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కనిగిరి ఏఎంసి చైర్మన్ రమా శ్రీనివాస్
పామూరు: ప్రతి బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కనిగిరి ఏఎంసి చైర్మన్ రమా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం పామూరు పట్టణంలో పంచాయతీ అధికారులు నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ పదం కార్యక్రమం ద్వారా మన పల్లెలను, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించవచ్చు అన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.