ఉరవకొండ: ఉరవకొండలో ఇంటి పట్టాల కొరకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో ఇంటి పట్టాల కొరకు అనువైన వివిధ స్థలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ శుక్రవారం పరిశీలించారు. పట్టణంలో గృహాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టేందుకు హౌసింగ్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పట్టణ సమీపంలో వివిధ అనువైన స్థలాలను మంత్రి పరిశీలించారు. పరిశీలించిన స్థలాలకు సంబంధించిన పూర్తి నివేదికలను త్వరితగతిన అందజేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.