ఉరవకొండ: బెలుగుప్ప మండలంలోని గ్రామాల్లో ఘనంగా పెద్ద సరిగెత్తు కార్యక్రమాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో శనివారం మొహరం వేడుకల్లో భాగంగా పెద్ద సరిగెత్తు కార్యక్రమాలను భక్తులు భక్తిశ్రద్ధలతో పానకాలు చక్కెర చదివింపు కార్యక్రమాలను చేపట్టారు. మండలంలోని బెలుగుప్ప, శ్రీరంగాపురం, దుద్దేకుంట ఆవులన్న ఎర్రగుడి జీడిపల్లి కాలువ పల్లి తదితర గ్రామాల్లో పెద్ద సరిగెత్తు కార్యక్రమాలను నిర్వహించారు. కోర్కెలు తీరిన భక్తులు పీర్ల స్వాములకు వెండి ఆభరణాల వితరణ, చక్కెర చదివింపులతో స్వాములకు మొక్కులు తీర్చుకున్నారు. మొహరం వేడుకల్లో భాగంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలను బెలుగుప్ప ఎస్సై శివ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.