కనిగిరి: పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన టిడిపి నాయకుడు శ్రీనివాస రెడ్డి అంతిమయాత్రలో పాడే మోసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా మృతి చెందగా ఆయన అంతిమయాత్రను ఆదివారం నిర్వహించారు. కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అంతిమయాత్రలో పాల్గొని శ్రీనివాసరెడ్డి పార్థివ దేహం ఉన్న పాడెను స్వయంగా మోస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మంచి నాయకుడిని టిడిపి కోల్పోయిందని, శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. అంతిమయాత్రలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.