కనిగిరి: పట్టణంలోని 1వ వార్డులో రూ.16.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ కాలువలకు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ శంకుస్థాపన
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో రూ.16.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... కనిగిరి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల వాటి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.