రాప్తాడు: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలి ప్రసన్నాయిపల్లి వద్ద బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ డిమాండ్
అనంతపురం రూరల్ లోని ప్రసన్నయిపల్లి సమీపంలోనే ఉన్న గంగపుత్రుల కళ్యాణ మండపంలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బీఎస్సీ పార్టీ రాయలసీమ జోనల్ సమావేశంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని 1950 ప్రెసిడెన్షియల రద్దు చేయాలని వీటిని అన్నిటి పైన రాయలసీమ బీఎస్పీ పార్టీ జోనల్ సమావేశంలో చర్చించి పోరాటాలు చేయబోతున్నామని, అదేవిధంగా నీటి పరీక్ష పేపర్లు లీక్ చేసిన నిందితులను కూడా కఠినంగా శిక్షించాలని గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు.