ఉరవకొండ: దుద్దే కుంటలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. పాఠశాలలో 18 సంవత్సరాల తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం దుద్దెకుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-2009 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో 18 సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. మొదటగా నాటి ఉపాధ్యాయులను సత్కరించి తమ విద్యాభ్యాస దశలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు తమ పాఠశాలకు 10,000 రూపాయల ఫర్నిచర్ అందించి, మరో బాల్యమిత్రుడు ఆరోగ్యంతో నాటి హెచ్ఎం రాఘవ ప్రసాద్ తో కలసి రూ. 15000 పూర్వ విద్యార్థులతో చేశారు.