ఉరవకొండ: పట్టణంలోని మహంకాళి జిమ్మి కట్ట వద్ద వర్షం కోసం ప్రత్యేక పూజలతో జలాభిషేక కార్యక్రమాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 7 వ వార్డులో మహంకాళి జిమ్మి కట్ట వద్ద శనివారం వర్షం కోసం ప్రత్యేక పూజలు చేసి జలాభిషేక కార్యక్రమాలను భక్తులు, రైతులు నిర్వహించారు. ఆలయంలోని నాగదేవతల మూల విరాట్ విగ్రహాలకు 108 బిందెలతో జలాభిషేకం చేసారు. పట్టణానికి చెందిన ఏడు మంది పెళ్లి కాని యువకులు మట్టి కుండల కళాశాలతో 108 కళాశాల బిందెలతో జలాభిషేకం చేశారు. అనంతరం జొన్నలపై ఉంచిన చిన్న రాతి గుండుపై కూర్చుని గిరగిరా తిరిగే వింత ఆచారంను సైతం పాటించి వరుణ దేవుని కరుణ కృపకు ప్రార్థించారు.