కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి గ్రామోత్సవం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కారణ నిర్వహణాధికారి నరసింహ బాబు గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.పట్టణంలోని భక్తులు గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు.