బియ్యం ధరలను నియంత్రించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలని, దుకాణాల వద్ద ధరల పట్టికలను ప్రదర్శించాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.