ఉరవకొండ: విద్యుత్ సరఫరా తీగలకు అంతరాయం కలిగిస్తున్న ముళ్లపొదల తొలగింపు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగల కు ఏపుగా పెరిగిన ముళ్ళపొదలు అంతరాయం కల్పిస్తుండడంతో ఆదివారం సాయంత్రం అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను మిషన్ల ద్వారా కోత చేసి కూలీలతో తొలగింప చేశారు. బెలుగుప్ప విద్యుత్ సబ్స్టేషన్ నుండి కాలనీలకు మరియు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలన్నదే విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ రుద్రమణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.