ఉరవకొండ: ఎస్ ఐ ఆర్ లో ఓటు నమోదు చేసుకోక పోతె ఓటు పోయినట్టే, దయచేసి ప్రతి ఒక్కరుఓటు నమోదు చేసుకోండి :మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బూదిగుమ్మ వద్ద ఆదివారం "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యావరణ కేశవ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అనేది జరుగుతోందని, దీంట్లో మనం ఓటు లేకపోతే పర్మనెంట్‌గా మనం ఓటు పోయినట్లే దయచేసి గుర్తుపెట్టుకోండన్నారు. ఓటు అనేటువంటిది మనం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోలేకపోతే శాశ్వతంగా కోల్పోతాం అని, దయచేసి మీరు శ్రద్ధ పెట్టండన్నారు. 14 చివరి తేదీ అని, 10, 11 రోజులు సమయం ఉందని, ఈ 10 రోజుల లోపల్నే ప్రతి ఓటుని కూడా మనం నమోదు చేసుకోవాలని ప్రతి నాయకుడు ఓటర్ నమోదుపై చొరవ చూపాలన్నారు.