కనిగిరి: భక్తి భావాన్ని పెంపొందించేందుకు స్కేటింగ్ ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తూ కనిగిరి కి చేరిన దీపక్ చౌదరి
కనిగిరి: సనాతన ధర్మంలో భాగంగా ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు బీహార్ రాష్ట్రం సీతామణి జిల్లా సింగభేరి గ్రామానికి చెందిన యువకుడు దీపక్ చౌదరి స్కేటింగ్ చేస్తూ దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే లక్ష్యంతో చేపట్టిన యాత్ర శుక్రవారం కనిగిరికి చేరింది. ఈ సందర్భంగా దీపక్ చౌదరి మాట్లాడుతూ... ఏప్రిల్ 24వ తేదీన ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు స్కేటింగ్ ద్వారా యాత్ర చేస్తూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించే లక్ష్యంతో బయలుదేరానని అన్నారు. అందులో భాగంగా బీహార్ నుండి రామేశ్వరం, తిరుపతి మీదగా శ్రీశైలం వెళ్తూ కనిగిరికి చేరుకున్నట్లు తెలిపాడు.