సంతనూతలపాడు: చీమకుర్తి లో మోటార్ బైక్ ను ఢీ కొట్టిన గ్రానైట్ ట్రాలీ వాహనం, వ్యక్తి అక్కడికక్కడే మృతి
చీమకుర్తి: మోటార్ బైకును గ్రానైట్ ట్రాలీ వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చీమకుర్తి తూర్పు బైపాస్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి పట్టణంలోని తూర్పు బైపాస్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గ్రానైట్ రాళ్లతో వెళుతున్న ట్రాలీ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.