ఉరవకొండ: రామసాగరం వద్ద 7వ రోజుకు చేరిన సత్య సాయి వాటర్ కార్మికుల సమ్మె
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని రామసాగరం గ్రామం వద్ద సత్యసాయి తాగునీటి పంప్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమం ఏడు రోజులుగా కార్మికులు చేపడుతున్నారు. సోమవారం నిరసన కార్యక్రమంలో జోలే పట్టిన శ్రీ సత్య సాయి వాటర్ ప్రాజెక్టు కార్మికులు మాట్లాడుతూ మాకు ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని అధికారులను కోరుకుంటున్నామని, మా జీతాలను మాకు వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శీనప్ప, సూరి, గంగాధర. హనుమంత రెడ్డి. వీరాంజనేయులు. బాలకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగినది