రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి గన్ మెన్ ను తొలగిస్తే ఎమ్మెల్యే పరిటాల సునీతకు సంబంధం ఏమిటి రాచానాపల్లిలో టిడిపి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో రాచానాపల్లిలో శుక్రవారం 12:30 గంటల సమయంలో టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతపై విమర్శలు చేయడం జరిగిందని ప్రకాష్ రెడ్డికి గన్ మెన్ ను తొలగిస్తే అది పరిటాల సునీతనే చేయించిందని అసత్య ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదని ప్రకాష్ రెడ్డి రెండేళ్లలో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని రూరల్ టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ విమర్శించారు.