కనిగిరి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు విస్తృతంగా తీసుకువెళ్లాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తరితంగా తీసుకు వెళుతున్న టాప్ 10 కార్యకర్తలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.