మార్కాపురంలో 5 ఏళ్లలోపు పిల్లలకు నిమోనియా వ్యాధి నివారణపై 'సాన్స్' అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 28 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి టీకాలు, లక్షణాల గురించి వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్న ర్యాలీ నిర్వహించారు.