సంతనూతలపాడు: మద్దిపాడు లో కిషోరి వికాసం 2026 పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన డీఈఓ రేణుక
మద్దిపాడు లోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం డీఈవో రేణుక ఆధ్వర్యంలో కిషోర్ వికాసం 2026 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా డిఇఓ రేణుక మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలికలకు కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రుతుక్రమంలో పరిశుభ్రత ,లైంగిక విద్య, బాల్యవివాహాలు, బాలల హక్కుల పరిరక్షణ పై ఆమె అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు