కనిగిరి: స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్
పామూరు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో అధికారులు బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్, బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి స్థానిక పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వచ్ఛ పదం కార్యక్రమం ఒకరోజు లేదా ఒకసారి నిర్వహించే కార్యక్రమం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. స్వచ్ఛ పదం కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం , పల్లెలను సుందరంగా తయారు చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.