సంతనూతలపాడు: సంతనూతలపాడు గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరం
అంత నూతలపాడు గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని గ్రంథపాలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రంథ పాలకుడు సత్యనారాయణ తెలిపారు. కేవలం చదివే కాకుండా విద్యార్థులకు వినోదాన్ని అందించేలా ఆటపాటలు నేర్పించడం, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు ఈ శిబిరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.