కనిగిరి: వెలిగండ్ల మండలం కండ్రిక గ్రామం బీసీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
వెలిగండ్ల మండలంలోని కండ్రిక గ్రామం బీసీ కాలనీలో పైప్ లైన్లు దెబ్బ తినడం, డీప్ బోర్ చెడిపోవడంతో వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యను స్థానికులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వెలిగండ్ల మండలానికి చెందిన ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డిని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం దెబ్బతిన్న పైపులకు మరియు డీప్ బోర్ కు కాశిరెడ్డి మరమ్మత్తులు చేయించారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీసీ కాలనీ ప్రజలకు తాగునీరు సాఫీగా అందే విధంగా చర్యలు తీసుకున్నారు