కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా వైభవంగా ఎదురుకోల కార్యక్రమం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా కీలక ఘట్టమైన ఎదురుకోల కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ మదన వేణుగోపాలస్వామి, శ్రీ రుక్మిణి ,సత్యభామ లను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలలో భక్తులు వెంటరాగా కళ్యాణమండపానికి సాంప్రదాయ బద్ధంగా తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నరసింహ బాబు, భక్తులు పాల్గొన్నారు.