కనిగిరి: హనుమంతునిపాడు లో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు
హనుమంతునిపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సమస్యలను ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు మంచినీటి వంటి వసతులను కల్పించాలని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపీడీవో ఆదేశించారు. ఎండ వేడిమి తీవ్రత అయ్యేలోపే ఉపాధి పనులను పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సిబ్బందిని ఎంపీడీవో ఆదేశించారు.