కనిగిరి: పట్టణంలో అదనపు సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఎడవల్లి లక్ష్మణరావు
కనిగిరి పట్టణంలో 1వ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఎడవల్లి లక్ష్మణరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు హాలులో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కనిగిరిలో ఏర్పాటుచేసిన 1 వ అదనపు సివిల్ జడ్జి కోర్టు ఎంతగానో దోహదపడుతుందని న్యాయమూర్తులు అన్నారు. కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేందుకు న్యాయవాదులు కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.