కనిగిరి: కనిగిరి పట్టణంలో మే డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల భారీ ర్యాలీ
కనిగిరి పట్టణంలో మేడే సందర్భంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని సుందరయ్య భవనం నుండి కార్మికులు ప్రధాన వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి పామూరు బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కేశవరావు మాట్లాడుతూ... కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు.